TRS: ఉపరాష్ట్రపతి ఎన్నిక.. మార్గరెట్‌ ఆళ్వాకు తెరాస మద్దతు

ఉప రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వాకు మద్దతివ్వాలని తెరాస నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 05 Aug 2022 11:57 IST

హైదరాబాద్‌: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వాకు మద్దతివ్వాలని తెరాస నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు (కేకే) ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం తెరాసకు చెందిన 16 మంది ఎంపీలు మార్గరెట్‌ ఆళ్వాకు ఓటు వేయనున్నారు.  

పార్లమెంట్‌ భవనంలో శనివారం ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఓట్ల లెక్కింపు జరగనుంది. రహస్య బ్యాలెట్‌ విధానంలో నిర్వహించనున్న ఈ ఎన్నికలో మొత్తం 788 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని