Dharmapuri Arvind: ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై తెరాస కార్యకర్తల దాడి

భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

Updated : 22 Nov 2022 16:39 IST

హైదరాబాద్‌: భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంటి ముట్టడికి వెళ్లిన తెరాస కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇటీవల ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ కవిత పార్టీ మారతారని చెప్పడంతో పాటు ఆయన మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెరాస కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆందోళన చేసిన వారిలో సుమారు 30 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పీఎస్‌లకు తరలించారు.

ఘటన జరిగిన సమయంలో ఎంపీ అర్వింద్‌ హైదరాబాద్‌లో లేరు. నిజామాబాద్‌లో కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో ఆయన ఉన్నారు. హైదరాబాద్‌లో తెరాస కార్యకర్తల దాడి నేపథ్యంలో నిజామాబాద్‌లో ఎంపీ ఇంటి వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.  

అర్వింద్‌కు బండి సంజయ్‌ ఫోన్‌

తెరాస కార్యకర్తల దాడి నేపథ్యంలో అర్వింద్‌ ఇంటికి భాజపా కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఎంపీ ఇంటి వద్దకు వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ చేరుకుని దాడికి ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. మరోవైపు ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై దాడిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఖండించారు. ఎంపీకి ఫోన్‌ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని