రెవెన్యూ బిల్లుపై సూచనలు స్వీకరిస్తాం: కేసీఆర్‌

నూతన రెవెన్యూ బిల్లుపై తెలంగాణ శాసనసభలో చర్చ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెవెన్యూ బిల్లుపై సభలో చర్చను ప్రారంభించారు...

Published : 11 Sep 2020 12:19 IST

హైదరాబాద్‌: నూతన రెవెన్యూ బిల్లుపై తెలంగాణ శాసనసభలో చర్చ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెవెన్యూ బిల్లుపై సభలో చర్చను ప్రారంభించారు. ‘‘ సభ్యులకు నూతన రెవెన్యూ బిల్లుపై మొన్ననే సమగ్రంగా వివరించాను. సభ్యులకు ఈ బిల్లుపై మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతున్నా. సభ్యుల నుంచి వచ్చిన సూచనలు పరిగణనలోకి తీసుకుంటాం. సభ్యులు మాట్లాడిన తర్వాత మరోసారి నేను వివరిస్తా’’ అని సీఎం తెలిపారు.

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ... నూతన రెవెన్యూ చట్టం తెచ్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. భూములకు సంబంధించి ఎన్ని చట్టాలు వచ్చినా చాలా చోట్ల ఆక్రమణలు జరిగాయన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న భూమి, రికార్డులో వివరాల్లో తేడాలు ఉన్నాయని వివరించారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని