Published : 31/08/2021 17:33 IST

Huzurabad: హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కావాలా..?దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్‌:  హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారు గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబరు5 సాయంత్రం 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. దరఖాస్తు చేసుకునేవారు రూ.5 వేల డీడీ తీయాల్సి ఉంటుందని చెప్పారు. సెప్టెంబరు 6న పీసీసీ బృందం ఆశావహులను ఇంటర్వ్యూ చేసి 10న ఏఐసీసీకి నివేదిక అందజేస్తుందని, ఆ తర్వాత అధిష్ఠానం అభ్యర్థిని ఖరారు చేస్తుందని చెప్పారు. పీసీసీ బృందంలో భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహా, పొన్నం ప్రభాకర్‌, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబుతో పాటు వరంగల్‌ డీసీసీ ప్రెసిడెంట్‌ నాయిని రాజేందర్‌రెడ్డి, కరీంనగర్‌ డీసీసీ ప్రెసిడెంట్‌ సత్యనారాయణ ఉంటారని చెప్పారు.

నిజాం ఆస్తుల విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మతకల్లోలాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మహేశ్‌ ఆరోపించారు. సంస్థానాలను, రాజాభరణాలు రద్దు చేసిన ఘనత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి చెల్లుతుందని గుర్తు చేశారు. గత ఏడేళ్లుగా మోదీ సర్కార్‌కు నిజాం ఆస్తులు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న డ్రామా అని  మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అధికార తెరాసను ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్ర ఎవరి కోసం చేస్తున్నారని అన్నారు. పెట్రోలు , డీజిల్ , గ్యాస్‌ ధరలు పెంచి ప్రజా సంగ్రామ యాత్రలు చేస్తున్నారా? అని  మహేశ్‌ ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని