TS High Court: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరణ

‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసును సీబీఐకి అప్పగించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

Updated : 15 Nov 2022 16:02 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది.  సీబీఐతో గాని లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని, సిట్‌ దర్యాప్తుపై స్టే విధించాలన్న భాజపా అభ్యర్థనను తోసిపుచ్చింది. దర్యాప్తులో పురోగతిని ఈనెల 29న జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి బెంచ్‌కు అందించాలని సిట్‌ను ఆదేశించింది. దర్యాప్తునకు సంబంధించిన విషయాలను రాజకీయ నాయకులకు, మీడియాకు, కార్యనిర్వాహక వ్యవస్థకు ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్‌ చేయొద్దని, ఒక వేళ అలా జరిగితే తగిన చర్యలు తీసుకొంటామని సీజే ధర్మాసనం తెలిపింది. సిట్‌ దర్యాప్తును జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి పర్యవేక్షిస్తారని సీజే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని