Published : 11 Aug 2022 01:19 IST

jagadishreddy: మునుగోడులో తెరాస నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు: జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌: మునుగోడులో తెరాస నాయకులందరూ ఐక్యంగానే ఉన్నారని, అసంతృప్తులు, అసమ్మతులు లేవని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి  తెలిపారు. సీఎం కేసీఆర్‌ మునుగోడు టికెట్‌ ఎవరికి ఇచ్చినా గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అభ్యర్థిని సీఎం కేసీఆర్‌ నిర్ణయిస్తారని, ప్రస్తుతానికి తెరాస పార్టీ, కారు గుర్తే తమ అభ్యర్థి అన్నారు. ఉప ఎన్నికల్లో తెరాసను గెలిపించేందుకు ప్రజలు కోరుకుంటున్నారని, సుమారు 50వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక రావాల్సిన అవసరమేంటో ప్రజలకు వివరిస్తామన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా విఫలమయ్యారని, తన స్వార్థం, కుటుంబ అభివృద్ధి కోసమే ఉప ఎన్నికలు తీసుకొచ్చారని మంత్రి ధ్వజమెత్తారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని, 2018లో తెరాస గెలవనందుకు నష్టపోయామన్న భావన ప్రజల్లో ఉందన్నారు. ప్రగతిభవన్‌లో మునుగోడు ప్రజాప్రతినిధులతో సమావేశమైన తర్వాత జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని