KTR: పెరిగే గ్యాస్‌ ధరతో.. ప్రజలకు గుండె దడ: కేటీఆర్‌

గడియకోసారి పెరుగుతున్న గ్యాస్‌ ధరతో దేశ ప్రజలకు గుండె దడ వస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మోదీ పాలనలో వంట గదుల్లో మంటలు పుడుతున్నాయని

Published : 08 Jul 2022 02:11 IST

హైదరాబాద్‌: గడియకోసారి పెరుగుతున్న గ్యాస్‌ ధరతో దేశ ప్రజలకు గుండె దడ వస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మోదీ పాలనలో వంట గదుల్లో మంటలు పుడుతున్నాయని వ్యాఖ్యానించారు. మోనార్క్‌ మోదీ రాజ్యంలో కుటుంబ బడ్జెట్‌లు తలకిందులయ్యాయని విమర్శించారు. భాజపా ప్రభుత్వం ధరలు పెంచి దేశ ప్రజలపై దొంగదాడి చేస్తోందని ఆరోపించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలనలో దేశం ఉందని పేర్కొన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన తెరాస కార్యకర్తలకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలనా విధానాలపై నిరంతర పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని