KTR: మునుగోడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం: మంత్రి కేటీఆర్
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
మునుగోడు: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. మునుగోడులో త్వరలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని వెల్లడించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.50కోట్లు,చండూరు మున్సిపాలిటికీ రూ.50కోట్లు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో కొత్త 5 సబ్ స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. చండూరును త్వరలో రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని ప్రకటించారు.
నారాయణపురంలో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. అందులో భాగంగానే ఇవాళ మునుగోడు నియోజకవర్గ సమీక్షకు మంత్రులు వచ్చారని తెలిపారు. నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలు తెరాస వశమయ్యాయన్న మంత్రి కేటీఆర్... నల్గొండ జిల్లా ప్రజలు తెరాసను చాలా గొప్పగా ఆదరించారన్నారు. జిల్లాలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. 2014కు ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క వైద్య కళాశాల కూడా లేదని గుర్తు చేశారు. నల్గొండ జిల్లాలో రాబోయే 6 నెలల్లో రూ.1,544 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sameera Reddy: మహేశ్‌బాబు సినిమా ఆడిషన్.. ఏడ్చుకుంటూ వచ్చేశా: సమీరారెడ్డి
-
India News
ఘోరం.. వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..!
-
Movies News
OTT Movies: డిజిటల్ తెరపై మెరవనున్న బాలీవుడ్ తారలు
-
Politics News
Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ గృహ నిర్బంధం
-
Crime News
Hyderabad: రామంతపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
World News
Vladimir Putin: రష్యాను ఎదుర్కోవడం సులువు కాదు..: పుతిన్