బజాజ్‌ చేతక్‌పై మంత్రి మల్లారెడ్డి చక్కర్లు 

బజాజ్‌ చేతక్‌ బండిని చూడగానే ఆ మంత్రికి గత స్మృతులు గుర్తుకొచ్చాయి. చదువుకొనే రోజులు.. ఇంటింటికీ తిరిగి పాలు అమ్మిన రోజులు.....

Published : 06 Feb 2021 01:48 IST

హైదరాబాద్‌: బజాజ్‌ చేతక్‌ బండిని చూడగానే ఆ మంత్రికి గత స్మృతులు గుర్తుకొచ్చాయి. చదువుకొనే రోజులు.. ఇంటింటికీ తిరిగి పాలు అమ్మిన రోజులు కళ్లముందు కదలాడాయి. ఆనాటి స్కూటర్‌ ఎక్కి అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు మంత్రి మల్లారెడ్డి. ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నా.. ఆనాటి చేతక్‌ బండిని చూడగానే అప్పటి రోజుల్లోకి వెళ్లిపోయారు. స్కూటర్‌పై చక్కర్లు కొట్టారు. మంత్రి మల్లారెడ్డి బోయిన్‌పల్లిలోని తన నివాసం వద్ద 30 ఏళ్ల నాటి బజాజ్‌ బండిపై తిరిగి గత అనుభూతి పొందారు.

అప్పట్లో మల్లారెడ్డి తన చేతక్‌ను ప్రభుగౌడ్‌ అనే వ్యక్తికి అమ్మేశారు. అతను మరో వ్యాపారికి అమ్మగా.. ఆ స్కూటర్‌ ఇప్పుడు మల్లారెడ్డికి కనిపించింది. ఎంతో కలిసొచ్చిన ఆ స్కూటర్‌ను తిరిగి తనకే విక్రయించాలని మంత్రి కోరగా.. ఆ యజమాని అందుకు నిరాకరించాడు. ఆ చేతక్‌తో తనకు కూడా ఎంతో కలిసి వచ్చిందని చెప్పాడు.

ఇదీ చదవండి..

‘ఉక్కు’ ప్రైవేటీకరణ నిర్ణయం ఒక్కరోజుది కాదు: సుజనా


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts