Talasani: కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే.. మేం కూడా సిద్ధమే: తలసాని

కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే.. తాము కూడా ముందస్తుకు సిద్ధమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ స్పష్టం చేశారు. మహారాష్ట్ర మోడల్‌గా రాష్ట్రాన్ని

Updated : 02 Jul 2022 18:07 IST

హైదరాబాద్‌: కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే.. తాము కూడా ముందస్తుకు సిద్ధమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ స్పష్టం చేశారు. మహారాష్ట్ర మోడల్‌గా రాష్ట్రాన్ని చేస్తామంటే కుదరదని.. సై అంటే సై అంటామన్నారు. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటామని.. ఎవరు ఎవరికీ భయపడరని భాజపానుద్దేశించి వ్యాఖ్యానించారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన సందర్భంలో తలసాని మీడియాతో మాట్లాడారు. 

బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్‌ రాలేదన్న ప్రశ్నకు తలసాని స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా తాను వచ్చినట్టు చెప్పారు. తెరాస ప్లీనరీ జరిగినప్పుడు కూడా పార్టీ ఫ్లెక్సీలకు జీహెచ్‌ఎంసీ ఫైన్‌ వేసిందని, మంత్రికి కూడా జరిమానా విధించారని తలసాని తెలిపారు. భాజపా కార్యాలయంలో సీఎం కేసీఆర్‌పై ఒక డిజిటల్‌ ఫ్లెక్సీ పెట్టారని.. ఆ తర్వాతే బై బై మోదీ అని ఫ్లెక్సీలు పెట్టారని పేర్కొన్నారు. భాజపా కార్యవర్గ భేటీ పేరుతో హైదరాబాద్‌కు టూరిస్టులు వచ్చారని, ఇక్కడ జరిగిన అభివృద్ధి చూసి తెలుసుకుని వెళ్తారన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా వచ్చిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీ కేవలం శాంపిల్‌ మాత్రమేనని ఇంకా చాలా ఉందని తెలిపారు. ‘‘తెరాస ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భాజపా నేతలు అడుగుతున్నారు. మేం అడుగుతున్నాం.. దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు రావాలి. అన్నీ కలిపి ఒకేసారి నిర్వహిద్దాం. దేనికైనా మేం సిద్ధమే. దమ్ముంటే ఎన్నికల్లో తలపడాలి’’ అని  తలసాని సవాల్‌ విసిరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని