Telangana News: ధాన్యం కొనుగోళ్లపై కవిత, రేవంత్‌ ట్వీట్‌ వార్‌

ధాన్యం కొనుగోలుపై రాహుల్ ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం ట్విటర్‌లో సంఘీభావం తెలపడం సరికాదన్నారు.

Updated : 29 Mar 2022 15:43 IST

హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై రాహుల్ ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం ట్విటర్‌లో సంఘీభావం తెలపడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రానికో విధానం ఉండకూడదని చెప్పారు. పంజాబ్‌, హరియాణాలో చేసినట్లు తెలంగాణ ధాన్యం సేకరించాలని కోరుతున్నామన్నారు. తెరాస ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నారని కవిత తెలిపారు. ఒకే దేశం- ఒకే సేకరణ విధానం కోసం రాహుల్ డిమాండ్‌ చేయాలని ఆమె సూచించారు.

ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ట్వీట్‌ చేశారు. పార్లమెంట్‌లో తెరాస ఎంపీల పోరాటం అనేది అబద్ధమన్నారు. తెరాస ఎంపీలు పార్లమెంట్‌లో కాలక్షేపం చేస్తున్నారని చెప్పారు. ఎఫ్‌సీఐకి బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమనే ఒప్పందంపై కేసీఆర్‌ సంతకం చేశారన్నారు. కేసీఆర్‌ సంతకం.. ఇవాళ తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైందని చెప్పారు. మరోవైపు రాహుల్‌ ట్వీట్‌పై రేవంత్‌ స్పందించారు. తెలంగాణ రైతుల ఆవేదన అర్థం చేసుకున్న రాహుల్‌కు ధన్యవాదాలు అని తెలిపారు.

ధాన్యం సేకరణలో భాజపా, తెరాస ప్రభుత్వాల వైఖరి దారుణమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. రైతులను ఇబ్బంది పెట్టడం ఆపాలని.. ప్రతి ధాన్యం గింజా కొనాలని డిమాండ్‌ చేస్తూ ఆయన తెలుగులో ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని