Updated : 04/02/2021 20:09 IST

ఆ ట్వీట్ల వెనక కుట్ర ఉంది..

దేవేంద్ర ఫడణవీస్‌ వ్యాఖ్యలు

నాగ్‌పూర్‌: దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులకు అనుకూలంగా ప్రపంచ సెలబ్రెటీలు, ఉద్యమకారులు చేస్తున్న ట్వీట్లపై కేంద్రం మండిపడుతోంది. ఇదే అంశంపై తాజాగా భాజపా సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు. ఇది భారత ప్రతిష్ఠను మసకబార్చేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్ర అన్నారు. దేశంలో గందరగోళం సృష్టించి అశాంతి రేపేందుకు ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. నాగ్‌పూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని బహిర్గత శక్తులు దేశంలో స్థిరత్వం కోరుకోవడంలేదనేది ఈ ట్వీట్ల ద్వారా తెలుస్తోందన్నారు.

రైతు ఉద్యమంపై సామాజిక మాధ్యమాల వేదికగా అనుకూల, వ్యతిరేక వాదనలు హోరెత్తుతున్నాయి. రైతుల ఆందోళనకు పాప్‌ సింగర్‌ రిహానా, పర్యావరణ పరిరక్షణకు ఉద్యమిస్తున్న గ్రెటా థన్‌బర్గ్‌ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు మద్దతు ప్రకటించారు. వీరి ట్వీట్లపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యం ఏంటంటూ మండిపడిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

కంగనకు మరోసారి ట్విటర్‌ షాక్‌

 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని