Uddhav Thackeray: ఈసీ నిర్ణయాన్ని దిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే

శివసేన(Shiv Sena) పార్టీ పేరు, ఎన్నికల గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఇటీవల జారీ చేసిన ఆదేశాలను ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం దిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ ఆదేశాలను కొట్టివేయాలని కోరింది.

Published : 10 Oct 2022 18:24 IST

దిల్లీ: శివసేన(Shiv Sena) పార్టీ పేరు, ఎన్నికల గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఇటీవల జారీ చేసిన ఆదేశాలను ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం దిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ ఆదేశాలను రద్దుచేయాలని కోరింది. ఈ నెల 8న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలు సహజ న్యాయ సూత్రాలను పూర్తిగా ఉల్లంఘించేలా ఉన్నాయని.. పార్టీలతో విచారణ జరపకుండానే ఆదేశాలు జారీ చేసిందని ఉద్ధవ్‌ ఠాక్రే తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

శివసేన పార్టీ తమదంటే తమదని గత కొన్ని నెలలుగా శిందే-ఠాక్రే వర్గాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంధేరీ తూర్పు స్థానం ఉప ఎన్నికల్లో శివసేన పేరు, ఎన్నికల గుర్తును వాడొద్దని ఇరు వర్గాలను ఈసీ శనివారం ఆదేశించింది. తాత్కాలికంగా కొత్త పేరు, గుర్తు కోసం మూడేసి ఐచ్ఛికాలను తమకు సమర్పించాలని సూచించింది. అయితే, వచ్చే నెల 3న జరగనున్న ఉప ఎన్నిక కోసం తమకు త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తుల్లో ఒకదాన్ని కేటాయించాలని మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వం లోని శివసేన వర్గం ఈసీని కోరింది. ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ మేరకు మూడు ఐచ్ఛికాలను సమర్పించినట్టు ఉద్ధవ్‌ ఠాక్రే నిన్న స్వయంగా వెల్లడించారు. తమ వర్గం కోసం ‘శివసేన బాలాసాహెబ్‌ ఠాక్రే’, ‘శివసేన బాలాసాహెబ్‌ ప్రబోధంకర్‌ ఠాక్రే’, ‘శివసేన ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే’ అనే మూడు పేర్లనూ ఐచ్ఛికాలుగా సమర్పించినట్లు తెలిపారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమకు గుర్తు, పేరు కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు