Uddhav Thackeray: శరద్‌ పవార్‌ రాజీనామాపై స్పందించిన ఉద్ధవ్‌ ఠాక్రే

Uddhav Thackeray: ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్‌పవార్‌ రాజీనామా వ్యవహారంపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు.

Updated : 04 May 2023 17:32 IST

ముంబయి:  ఎన్సీపీ (NCP) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌(Sharad Pawar) తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎం  ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు.  పవార్‌ రాజీనామా వ్యవహారం కాంగ్రెస్‌, ఎన్సీపీ శివసేన(ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే)లతో కూడిన మహా వికాస్‌ అఘాడీ(MVA) కూటమిపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. గురువారం ఆయన ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసే ఏ పనీ తాను చేయబోనన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీకి తాను వ్యతిరేకం కాదన్న ఉద్ధవ్‌.. నియంతృత్వానికి మాత్రం పూర్తి వ్యతిరేకమని స్పష్టంచేశారు. ఎన్సీపీలో జరుగుతున్న పరిణామాలు మహా వికాస్‌ అఘాడీ కూటమికి ఎలాంటి నష్టం చేయవన్నారు. ఎన్సీపీ చీఫ్‌గా  వైదొలుగుతూ పవార్‌ తీసుకున్న నిర్ణయంపై స్పందించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.  

ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ శరద్‌ పవార్‌ అనూహ్య నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. కొందరు రాజీనామాలు చేస్తామని హెచ్చరించగా.. ఇంకొంతమంది నిరాహార దీక్షలకు దిగుతామంటూ బెదిరింపులకు పాల్పడినా పవార్‌ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. అలాగే, పార్టీలో క్రియాశీలంగా ఉంటానని, అధ్యక్ష పదవి నుంచి మాత్రమే వైదొలిగానని ఆయన స్పష్టంచేశారు. అయితే,  పవార్‌ రాజీనామాతో తదుపరి అధ్యక్ష పదవి ఎవరికి అప్పగిస్తారనే  అంశం ఉత్కంఠగా మారింది. శుక్రవారం ముంబయిలో జరిగే పార్టీ కీలక సమావేశంలో ఈ వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని