రష్యా యుద్ధ చిహ్నాలను నిషేధించిన ఉక్రెయిన్‌

రష్యా యుద్ధ చిహ్నాలను నిషేధిస్తున్నట్లు ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా యుద్ధ ప్రచారానికి వాడుతున్న జడ్‌, వి చిహ్నాలను తమ దేశంలోనిషేధిస్తున్నట్లు పేర్కొంది.

Published : 24 May 2022 01:19 IST

కీవ్‌: రష్యా యుద్ధ చిహ్నాలను నిషేధిస్తున్నట్లు ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా యుద్ధ ప్రచారానికి వాడుతున్న ‘జడ్‌’, ‘వి’ చిహ్నాలను తమ దేశంలో నిషేధిస్తున్నట్లు పేర్కొంది. పార్లమెంట్‌ నిర్ణయానికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీ మద్ధతు తెలిపారు. మ్యూజియంలు, లైబ్రరీలు, శాస్త్రీయ రచనలు, పునర్నిర్మాణాలు, పాఠ్యపుస్తకాలు ప్రదర్శనల్లో మాత్రమే వీటిని అనుమతించినట్లు పేర్కొన్నారు. ఈ చిహ్నాలను విద్య, చారిత్రక ప్రదర్శనల్లో అనుమతించాలని పిలుపునిచ్చారు. 423 మంది సభ్యులున్న వెర్ఖోవ్నా రాడా అసెంబ్లీలో 313 మంది సభ్యులు ఈ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేశారని టేలిగ్రాం వేదికగా ప్రతిపక్ష సభ్యుడు యారోస్లావ్ జెలెజ్‌న్యాక్ తెలిపారు. ‘జడ్‌’, ‘వి’  చిహ్నాలను యుద్ధ ప్రచారం చేయడానికి రష్యన్‌ వాహనాలపై, ఆయుధాలపై విస్తృతంగా వినియోనియోగిస్తున్నారని అందుకే బహిష్కరించామని ప్రతినిధులు అన్నారు. 

యుద్ధ చట్టం పొడిగింపు..

ఉక్రయిన్‌లో యుద్ద చట్టాన్ని మరో 90 రోజులు పొడిగించినట్లు ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ చట్టం ఆగష్టు 23 వరకు అమలులో ఉండనుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని