Narayan rane: కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణెకు బెయిల్‌ మంజూరు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టు అయిన కేంద్ర మంత్రి నారాయణ రాణేకు బెయిల్‌ మంజూరు అయింది. రాయ్‌గఢ్‌లోని మహద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలతో పోలీసులు ఎలాంటి

Updated : 25 Aug 2021 09:11 IST

రాయ్‌గఢ్‌: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్టు అయిన కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణెకు బెయిల్‌ మంజూరు అయింది. రాయ్‌గఢ్‌లోని మహద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలతో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారని కోర్టులో నారాయణ్‌ రాణె తరఫు న్యాయవాదులు వాదించారు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనకు బెయిల్‌ లభించింది. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా  సోమవారం నారాయణ్‌ రాణె రాయ్‌గఢ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని, అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో రత్నగిరి పర్యటనలో ఉన్న ఆయనను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీంతో ఆయన ఆరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.

 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని