Updated : 18 Feb 2022 16:49 IST

Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వశాఖ హైదరాబాద్‌లో గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్ ట్రెడిషనల్‌ మెడిసిన్‌ను స్థాపించాలని భావిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో గ్లోబల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం వల్ల నగరానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. భూమి గుర్తింపునకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి, గ్లోబల్‌ సెంటర్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు తగిన భూమిని గుర్తించాలని కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. హైదరాబాద్‌లో గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్ నెలకొల్పడానికి డబ్ల్యూహెచ్‌వో ముందుకొచ్చింది. పీఎంవో నుంచి కూడా ఇటీవల అధికారిక ప్రతిపాదన రావడంతో ఇందుకు అవసరమైన సుమారు 40-50 ఎకరాల స్థల సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts