ఆ సూచనతోనే ‘ఉక్కు’ ప్రైవేటీకరణ: అనురాగ్‌

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌..

Updated : 06 Feb 2021 15:46 IST

హైదరాబాద్‌: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ దీనిపై హైదరాబాద్‌లో స్పందించారు. నీతి ఆయోగ్‌ సూచనతోనే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నామని అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టంచేశారు. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థనూ అమ్మకానికి పెట్టబోమని, నష్టాల్లో ఉన్నవాటినే ప్రైవేటీకరిస్తామన్నారు.శనివారం ఆయన హైదరాబాద్‌లో పర్యటించారు. భాజపా తెలంగాణ, లఘు ఉద్యోగ్‌ భారతి ఆధ్వర్యంలో మేధావులు, పారిశ్రామికవేత్తలతో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగలేదు

ఒప్పందం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తున్నట్టు అనురాగ్‌ తెలిపారు. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇటీవల మూడు సార్లు తమను కలిశారని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగలేదని చెప్పారు. బడ్జెట్‌ను జాతీయ దృక్పథంతో చూడాలనిసూచించారు.

ఇదీ చదవండి..

తెదేపా ఎమ్మెల్యే గంటా రాజీనామా


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని