TS News: వ్యవసాయ రంగంపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే సమీక్ష

రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే బీఆర్కే

Published : 13 Sep 2021 22:22 IST

హైదరాబాద్‌: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే బీఆర్కే భవన్‌లో వ్యవసాయరంగం, రైతుల సంక్షేమంపై చర్చించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు  సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానాలతో ముందుకు సాగుతోందని, వ్యవసాయం, అనుబంధ రంగాలకు  ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనీ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగుకు వంద శాతం రాయతీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని శోభా కరంద్లాజే తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని