Maharashtra crisis: ప్రతిపక్షంలో మేమింకా 2-3 రోజులే.. భాజపా మంత్రి కీలక వ్యాఖ్యలు..!

మహారాష్ట్రలో రాజకీయంగా ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Updated : 27 Jun 2022 12:27 IST

(ఫైల్‌ ఫొటో)

ముంబయి: మహారాష్ట్ర(Maharashtra)లో ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా.. అసమ్మతి ఏక్‌నాథ్ శిందే వర్గం హోటల్‌లో కూర్చొనే తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి రావ్ సాహెబ్ దన్వే(Raosaheb Danve) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

‘నేను రెండున్నరేళ్లుగా కేంద్రమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నాను. తోపే సాహెబ్(మహారాష్ట్ర కెబినేట్ మంత్రి రాజేశ్‌ తోపే) రాష్ట్ర మంత్రి. మీరు 14 ఏళ్లుగా మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక మీ పని ముగించండి. సమయం మించిపోతోంది. మేమింక రెండు మూడు రోజులు మాత్రమే ప్రతిపక్షంలో ఉంటాం’ అంటూ దన్వే వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జల్నాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోతుందని సూచనగా చెప్తూ ఈ మాటలన్నారు. ఆ సమయంలో రాజేశ్ తోపే అదే వేదికపై ఉండటం గమనార్హం. ఇదే సమయంలో శివసేనలో చెలరేగిన అసమ్మతికి తమకు ఏ సంబంధం లేదని మరోసారి వెల్లడించారు. అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను ముఖ్యమంత్రి.. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌కు మళ్లించడమే అసమ్మతి నేతల ఆగ్రహానికి కారణమని చెప్పారు. రాజేశ్ తోపే.. ఎన్‌సీపీకి చెందిన నేత. సంకీర్ణ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖమంత్రిగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని