UP Assembly Elections: 80శాతానికి పైగా సీట్లు గెలుస్తాం: యోగి ఆదిత్యనాథ్‌

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఆరో విడత ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం ఆరు గంటల వరకు

Published : 03 Mar 2022 10:11 IST

యూపీలో కొనసాగుతున్న ఆరో విడత ఎన్నికల పోలింగ్ 

లఖ్‌నవూ: ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఆరో విడత ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. పది జిల్లాల పరిధిలోని 57 స్థానాల్లో 676 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2.14కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ దశ ఎన్నికల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో 80 శాతానికి పైగా సీట్లు గెలుస్తామన్నారు. గోరఖ్‌పూర్‌ అర్బన్‌ నుంచి ఆయన బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 7న ఇక్కడ చివరి విడత ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని