హాథ్రస్‌లో ఉద్రిక్తత.. కిందపడిపోయిన మరో ఎంపీ!

అత్యాచారానికి గురైన హాథ్రస్‌ దళిత యువతి మృతి, తదనంతర పరిణామాలతో ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడో రోజూ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబ ......

Updated : 10 Dec 2021 13:35 IST

మహిళా ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేశారంటూ నిరసన

హథ్రాస్‌ (యూపీ): అత్యాచారానికి గురైన హాథ్రస్‌ దళిత యువతి మృతి, తదనంతర పరిణామాలతో ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడో రోజూ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు నిన్న ప్రయత్నించిన కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ప్రియాంకకు పోలీసుల నుంచి ఎదురైన అనుభవమే తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలకూ ఎదురైంది. హాథ్రస్‌ గ్రామం సమీపంలోకి వెళ్లిన తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రియన్‌ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతించబోమన్నారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదం, తోపులాటలో ఎంపీ డెరిక్‌ ఓబ్రియన్‌ కింద పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

బాధిత కుటుంబాన్ని కలిసేందుకు తమను గ్రామంలోకి అనుమతించాలని మహిళా ఎంపీలు చేతులు జోడించి కోరినా పోలీసులు వినలేదు. తృణమూల్‌ ఎంపీలు ప్రతిమ మండల, కకోలి ఘోష్‌ దస్తిదర్‌, మాజీ ఎంపీ మమతా ఠాకూర్‌లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కనీసం మహిళలనైనా గ్రామంలోకి అనుమతించాలని ఓబ్రెయిన్‌ కోరినా వినని పోలీసులు.. ఆ ప్రాంతాన్ని మూసివేశారు. మహిళా నేతల పట్ల పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎంపీలు, తృణమూల్‌ నేతలు బాధితురాలి నివాసానికి కి.మీ దూరంలో బైఠాయించారు. అయితే, ఈ ఘటనపై హాథ్రస్‌ సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ ప్రేమ్‌ ప్రకాశ్‌ మీనా మాట్లాడుతూ.. తృణమూల్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. మహిళా కానిస్టేబుళ్లు వారిని వెనక్కి వెళ్లిపోవాలని కోరినా వినలేదని, ముందుకు దూసుకొచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని