UP Polls: మంత్రి కొడుకు డబ్బులు పంచుతున్న వీడియో వైరల్‌.. ఈసీ సీరియస్‌!

యూపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ప్రజల్ని తమవైపు ఆకర్షించి ఓట్లు కొల్లగొట్టేందుకు రాజకీయ పార్టీల ప్రయత్నాలు.......

Published : 25 Jan 2022 21:52 IST

బులంద్‌షెహర్‌: యూపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ప్రజల్ని తమవైపు ఆకర్షించి ఓట్లు కొల్లగొట్టేందుకు రాజకీయ పార్టీల ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో యూపీ మంత్రి, ఈ ఎన్నికల్లో శిఖర్‌పూర్ నుంచి భాజపా తరఫున బరిలో నిలిచిన అనిల్‌ శర్మ తనయుడు ప్రజలకు డబ్బుల పంచుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో ఎన్నికల సంఘం అధికారులు సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనపై 24గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ మంత్రిని శిఖర్‌పూర్‌ రిటర్నింగ్‌ అధికారి కోరారు. మంత్రి శర్మ తనయుడు కుష్‌ తన వాహనం వద్ద డప్పుల చప్పుళ్ల మధ్య ప్రజలకు రూ.100 నోట్లు పంచుతున్నట్టుగా ఈ వీడియోలో రికార్డయి ఉంది. దీంతో రిటర్నింగ్‌ అధికారి మంత్రి శర్మకు నోటీసులు ఇచ్చారు. ఆయనకు చెందిన పార్టీ వారు ఆ ప్రాంతంలో డబ్బులు పంచుతున్నారనీ.. ఇది ప్రాథమికంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ అంశంపై 24గంటల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలంటూ మంత్రికి నోటీసులు జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని