UP polls 2022: యూపీలో ముగిసిన ఐదో దశ పోలింగ్.. 54శాతం ఓటింగ్
ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా.. ఐదో విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా ముగిసింది......
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా.. ఐదో విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా ముగిసింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 53.98 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
అవధ్, పూర్వాంచల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 12 జిల్లాల్లోని 61 నియోజకవర్గాల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 692 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ప్రయాగ్ రాజ్, అమేఠీ, రాయ్ బరేలీ, అయోధ్య వంటి కీలక జిల్లాల్లో ఈ దఫా పోలింగ్ జరిగింది. అత్యధికంగా చిత్రకూట్ జిల్లాలో 59.64శాతం ఓటింగ్ నమోదైంది. 58.01 శాతంతో ఆ తర్వాతి స్థానంలో అయోధ్య నిలిచింది. ప్రతాప్‌గఢ్ జిల్లాలో అత్యల్పంగా 50.25శాతం మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు.
సిరతు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. ప్రయాగ్‌రాజ్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన యూపీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రతాప్‌గఢ్ కుందా స్ధానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి గుల్షన్ యాదవ్ కాన్వాయ్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో గుల్షన్ యాదవ్ తప్పించుకున్నారు. కాగా ఈ దాడిలో కాన్వాయ్‌లోని ఓ వాహనం ధ్వంసమైంది.
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో 7 విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా ఆదివారం 292 స్థానాలకు ఓటింగ్ పూర్తయ్యింది. మార్చి 3, 7 తేదీల్లో 6, 7 విడతల పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి కాదా అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్‌పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్‌సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్‌పై ఒంటరిగానే నా పోరాటం
-
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్‌సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
బాలీవుడ్, హాలీవుడ్‌ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది. -
రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం నేడు
కాంగ్రెస్ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(పీఈసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్