ఎడారిగా సాగర్‌ ఆయకట్టు: ఉత్తమ్‌

నీటి పంపకాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే ప్రస్తుతం తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో

Updated : 06 Jul 2021 19:31 IST

హైదరాబాద్: నీటి పంపకాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే ప్రస్తుతం తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. సమీప భవిష్యత్తులో నాగార్జునసాగర్‌ ఆయకట్టు పూర్తి ఏడారిగా మారబోతోందని.. అందుకు సీఎం కేసీఆర్‌ కారణమవుతారని విమర్శించారు. గ్రావిటీ ద్వారా రావాల్సిన 11 టీఎంసీల నీటి గురించి ఆలోచించకుండా కేవలం 3 టీఎంసీల నీటి కోసం రూ.1.18 లక్షల కోట్లు వ్యయం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రావిటీ ద్వారా వచ్చే ఆ 11 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌ మళ్లించి తీసుకెళ్తోందన్నారు. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టుల్లో వృథా ఖర్చు ఎక్కువైందని.. ఏడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా అప్పులు చేసిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ పెద్దలకు 8 శాతం కమీషన్‌ అందుతోందని.. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించనున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని