Uttarakhand: కొత్త సీఎంకు మ్యాప్‌ కష్టాలు!

ఉత్తరాఖండ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టకముందే పుష్కర్‌ సింగ్‌ ధామీ వివాదంలో చిక్కుకున్నారు. ఆరేళ్ల క్రితం అఖండ్‌ భారత్ పేరిట ఆయన చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా.....

Published : 04 Jul 2021 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరాఖండ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టకముందే పుష్కర్‌ సింగ్‌ ధామీ వివాదంలో చిక్కుకున్నారు. ఆరేళ్ల క్రితం అఖండ్‌ భారత్ పేరిట ఆయన చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ పటంలో ప్రస్తుత భారత భూభాగాలు లేకపోవడం వివాదానికి కారణమైంది. దీంతో ఆ ట్వీట్‌ను నెటిజన్లు ఇప్పుడు వైరల్‌ చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే చిరిగిన జీన్స్‌పై కామెంట్స్‌ చేసి సీఎం తీరథ్‌ సింగ్‌ రావత్‌ వివాదంలో చిక్కుకోగా.. పుష్కర సింగ్‌ ధామీకి అర్ధ పుష్కర కాలం నాటి మ్యాప్‌ చిక్కులు తెచ్చిపెట్టిందన్నమాట!

2015లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అఖండ్‌ భారత్‌ కల సాకారం కావాలని పేర్కొంటూ ఈ మ్యాప్‌ను పుష్కర్‌సింగ్‌ అప్పట్లో ట్వీట్‌ చేశారు. ఆ మ్యాప్‌లో భరతమాత మధ్యలో ఉండగా... ఇరుగుపొరుగు దేశాలు అందులో ఉన్నాయి. అయితే భారత్‌లో అంతర్భాగంగా ఉన్న లద్దాఖ్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతాలు లేకపోవడంతో నెటిజన్లు ఆ ట్వీట్‌ను వైరల్‌ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కొత్త సీఎంపై మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. ఏదైతేనేం మొత్తానికి నిన్న మొన్నటి వరకు పెద్దగా పరిచయం లేని పుష్కర్‌ సింగ్‌ ఈ మ్యాప్‌ ద్వారా నెటిజన్లకు బాగానే పరిచయం అయ్యారన్నమాట!!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని