వ్యాక్సిన్‌ పాలసీ నోట్లరద్దు లాంటిదే..

కరోనాపై పోరులో భాగంగా మే 1 నుంచి వ్యాక్సిన్ల కొనుగోలు విధానంలో పలు మార్పులు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. నూతన వ్యాక్సిన్‌ పాలసీ.

Published : 22 Apr 2021 01:26 IST

కేంద్రంపై రాహుల్‌గాంధీ విమర్శలు

దిల్లీ: కరోనాపై పోరులో భాగంగా మే 1 నుంచి వ్యాక్సిన్ల కొనుగోలు విధానంలో పలు మార్పులు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. నూతన వ్యాక్సిన్‌ పాలసీ.. నాలుగేళ్ల క్రితం ప్రకటించిన నోట్లరద్దు లాంటిదేనని పేర్కొన్న రాహుల్‌.. ఇది పూర్తిగా వివక్షపూరితమైన, అసమానత విధానం అని దుయ్యబట్టారు.

‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యాక్సిన్‌ పాలసీ.. నోట్లరద్దు కంటే తక్కువేమీ కాదు. సామాన్య ప్రజలు క్యూలైన్లలో నిల్చుంటారు. ఆరోగ్యం, ఆస్తులు, చివరకు ప్రాణాలు కూడా కోల్పోతారు. అంతిమంగా కొద్దిపాటి బడా పారిశ్రామికవేత్తలు ప్రయోజనం పొందుతారు’’ అని రాహుల్‌ ట్విటర్‌ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

రాహుల్‌ మంగళవారం కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కన్పించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయనట్లు ఆయన నిన్న ప్రకటించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 

వ్యాక్సిన్‌ కొనుగోలులో రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పిస్తూ కేంద్రం గత సోమవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.   టీకా తయారీదారులు... 50% ఉత్పత్తిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయడానికి అనుమతి కల్పించింది. అంతేగాక, 18ఏళ్ల పైబడిన వారందరూ మే 1 నుంచి టీకాలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని