Updated : 07 Jan 2022 16:45 IST

TS News: పాల్వంచ ఘటన.. తెరాస నుంచి వనమా రాఘవ సస్పెన్షన్‌

హైదరాబాద్‌: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు, తెరాస నేత వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు తెరాస ప్రకటించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రాఘవను సస్పెండ్‌ చేసినట్లు తెలిపింది. ఈ సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని తెరాస వెల్లడించింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో వనమా రాఘవ నిందితుడిగా ఉన్నారు. ఆయన వేధింపుల వల్లే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆయన సెల్ఫీ వీడియో గురువారం బయటకు వచ్చింది. ఆ వీడియోలో రాఘవపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో పలు ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు రాఘవను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెరాస ప్రకటించింది. 


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని