Vangalapudi Anitha: వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది: హోంమంత్రి అనిత

వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

Updated : 15 Jun 2024 12:57 IST

అంతర్వేది: వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్ల కాలంలో అనేక మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. అన్ని అంశాలపై పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని