Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనిత

ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్‌-2లో దస్త్రాలపై సంతకాలు చేసిన బాధ్యతలు చేపట్టారు.

Updated : 19 Jun 2024 11:55 IST

అమరావతి: ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్‌-2లో దస్త్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కుమార్తె రష్మితతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు హోంమంత్రికి వేదాశీర్వచనం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం వివిధ శాఖల అధికారులు, నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని