Janasena: కత్తిపూడి సభ తర్వాత వారాహి యాత్ర ప్రారంభం: నాదెండ్ల

కత్తిపూడి సభ తర్వాత ఈ నెల 14 నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రను ప్రారంభించనున్నట్లు పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Published : 05 Jun 2023 20:44 IST

అమరావతి: ఈ నెల 14 నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రను ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. కత్తిపూడి సభ తర్వాత వారాహి యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ మేరకు వారాహి యాత్ర గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలోనూ జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘‘పోలవరం ఎత్తు తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసింది. పోలవరానికి రూ.17,144 కోట్ల నిధులిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదిస్తున్నట్లు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసేలా వ్యవహరిస్తోంది. పోలవరంలో సీఎం పర్యటన దృష్ట్యా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారో ప్రజలకు సీఎం చెప్పాలి’’ అని నాదెండ్ల డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని