Andhra News: బాధితురాలి వద్ద బలప్రదర్శన చేస్తారా?: వాసిరెడ్డి పద్మ

విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద నిన్నటి పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సీనియర్‌ నేత బొండా ఉమాలకు సమన్లు జారీ చేసినట్లు

Updated : 23 Apr 2022 16:26 IST

విజయవాడ: విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద నిన్నటి పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సీనియర్‌ నేత బొండా ఉమాలకు సమన్లు జారీ చేసినట్లు ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. సమన్లు జారీకి కారణాలు చెప్పాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందని తెలిపారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళల కన్నీళ్లు తుడవడానికే మహిళా కమిషన్‌ ఉందని వివరించారు. అత్యాచారం ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని వాసిరెడ్డి పద్మ చెప్పారు. బాధితురాలి వద్ద బల ప్రదర్శన చేస్తారా అని ప్రశ్నించారు. 24 గంటల్లో బాధ్యులను అరెస్టు చేస్తున్నామన్నారు. వారం రోజుల్లో ఛార్జిషీట్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె చెప్పారు. 

విజయవాడలోని ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు తనను అభ్యంతరకర పదజాలంతో దూషించారంటూ చంద్రబాబు, బొండా ఉమామహేశ్వరరావులకు వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని కార్యాలయంలో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని