AP News: వైకాపాను గద్దె దించితే తెదేపాను భాజపాలో కలుపుతామన్నారు: విజయసాయి

తన స్వలాభం కోసమే తెదేపా అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని మోసం చేశారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఉత్తరాంధ్రలో మాదకద్రవ్యాలకు

Updated : 22 Oct 2021 15:01 IST

విశాఖ: తన స్వలాభం కోసమే తెదేపా అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని మోసం చేశారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఉత్తరాంధ్రలో మాదకద్రవ్యాలకు పురుడు పోసింది తెదేపా నేతలేనన్నారు. రూ.500 కోట్ల గంజాయి అక్రమ జరిగిందన్నారు. శుక్రవారం ఆయన విశాఖలో జరిగిన వైకాపా జనాగ్రహ దీక్షలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్‌లపై మండిపడ్డారు. రాష్ట్రంలో నమ్మడంలేదనే చంద్రబాబు దిల్లీ వెళ్తున్నారన్నారు. నర్సీపట్నం ప్రజలు వద్దని చెప్పినా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి బుద్ధిరాలేదని వ్యాఖ్యానించారు. భాజపా పెద్దలకు చంద్రబాబు ప్రతిపాదనలు పంపారనీ.. వైకాపా సర్కారును గద్దె దించితే తెదేపాను భాజపాలో కలుపుతామన్నారంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. 

జగన్‌ను పదవి నుంచి దించాలని చంద్రబాబు ప్రయత్నం: సజ్జల

మరోవైపు, గుంటూరులో జరిగిన జనాగ్రహ దీక్షలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. తెదేపా కార్యాలయం దేవాలయమని చంద్రబాబు అన్నారు.. మరి  దేవాలయంలో బూతులు ఎలా మాట్లాడనిచ్చారు? అంటూ సజ్జల ప్రశ్నించారు. బూతులపై  చంద్రబాబు ఉద్యమం నిర్మిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు.. జగన్‌ను పదవి నుంచి దింపాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని