రాజీనామాలతో సాధించేదేంటి?: విజయసాయి

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజీనామా చేస్తే సాధించేదేమీ ఉండదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు

Updated : 10 Mar 2021 13:18 IST

విశాఖ: విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజీనామా చేస్తే సాధించేదేమీ ఉండదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలన్న తెదేపా డిమాండ్‌ అసంబద్ధమని విమర్శించారు. రాజీనామా చేసి ఏం సాధిస్తామని ఆయన ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. 

పదవులు త్యజిస్తే పార్లమెంట్‌లో మన గళం వినిపించలేమని.. ప్రధాని అపాయింట్‌మెంట్‌ కూడా దొరకదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉక్కు ప్రైవేటీకరణ సహా ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న భాజపా వ్యవహరిస్తున్న తీరు ముమ్మాటికీ తప్పేనన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని