గంటా స్పందనపై విజయసాయిరెడ్డి కౌంటర్‌

మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందనపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. వైకాపాలో చేరతానని గంటా గతంలో ప్రతిపాదన

Published : 04 Mar 2021 01:20 IST

విశాఖ: మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందనపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. వైకాపాలో చేరతానని గంటా గతంలో ప్రతిపాదన పంపారని.. దానిపై సీఎం జగన్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. గంటా ప్రతిపాదనను సీఎం ఆమోదిస్తే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. మైండ్‌ గేమ్‌ ఆడాల్సిన అవసరం తమ పార్టీకి లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. వైకాపాలోకి గంటా శ్రీనివాసరావు వచ్చినంత మాత్రాన ప్రభుత్వంలో మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. 

అసలేం జరిగిందంటే..

గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీ విశ్వనాథ్‌ బుధవారం వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జగన్‌ పాలన చూసి చాలా మంది వైకాపాలో చేరుతున్నారన్నారు. గంటా శ్రీనివాసరావు కొన్ని ప్రతిపాదనలు పంపారని.. జగన్‌ ఆమోదం తర్వాత పార్టీలోకి ఆయన వచ్చే అవకాశముందని చెప్పారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో గంటా కూడా స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు చాలాసార్లు ప్రచారం జరిగిందని.. దాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నానని చెప్పారు. విజయసాయి ఏ లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు. సీఎంకు తాను ఎలాంటి ప్రతిపాదనలు పంపానో ఆయన చెప్పాలని గంటా డిమాండ్‌ చేశారు. గంటా వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా విజయసాయిరెడ్డి ఆయనకు కౌంటర్‌ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని