Vijayashanthi: భాజపా రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి అసంతృప్తి

భాజపా రాష్ట్ర నాయకత్వంపై మాజీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తి వ్యక్తం

Updated : 18 Aug 2022 15:16 IST

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర నాయకత్వంపై మాజీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్ర నాయకత్వం తనను నిశ్శబ్దంలో ఉంచిందని ఆరోపించారు. తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగాలని మీడియా ప్రతినిధులకు ఆమె సూచించారు.

‘‘నేను అసంతృప్తిగా ఉన్నానో లేదో పార్టీ నేతల వద్ద స్పష్టత తీసుకోండి. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మాట్లాడదామనుకున్నా. లక్ష్మణ్‌ వచ్చి మాట్లాడారు.. వెళ్లిపోయారు.. నాకేమీ అర్థం కాలేదు. నా సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్‌, లక్ష్మణ్‌కే తెలియాలి. పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలం. ఇవ్వకుండా చేయమంటే ఏం చేయగలం? నా పాత్ర ఎప్పుడూ టాప్‌ పాత్రే. రాములమ్మ ఎప్పుడూ రాములమ్మ పాత్రే. ఉద్యమకారిణిగా అందరి హృదయాల్లో ఉన్నాను. పార్లమెంట్‌లో కొట్లాడిన మనిషిని. నా పాత్ర ఎప్పుడూ బాగానే ఉంటుంది. పాత్ర లేకుండా చేయాలనుకునే వాళ్లను పాతరేస్తే బెటర్‌గా ఉంటుంది’’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు.  


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని