జేపీ నడ్డాను కలిసిన విజయశాంతి

భాజపాలో చేరిన మాజీ ఎంపీ విజయశాంతి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌,

Updated : 08 Dec 2020 01:23 IST

దిల్లీ: భాజపాలో చేరిన మాజీ ఎంపీ విజయశాంతి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎంపీ వివేక్‌ ఇతర నేతలు పాల్గొన్నారు. భాజపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ విజయశాంతికి సోమవారం కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో విజయశాంతి మాట్లాడారు. తాను భాజపాతోనే రాజకీయ జీవితాన్ని ఆరంభించానని, తెరాస అవినీతిని బయటపెట్టడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. తన పాత్ర ఏంటన్నది పార్టీయే నిర్ణయిస్తుందని.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని