Updated : 24 Apr 2022 13:53 IST

Andhra News: ‘చలో సీఎంవో’కు అనుమతి లేదు.. పాల్గొంటే చర్యలు: విజయవాడ సీపీ కాంతిరాణా

విజయవాడ: యూటీఎఫ్‌ తలపెట్టిన ‘చలో సీఎంవో’కు అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతిరాణా తెలిపారు. రేపు చలో సీఎంవో కార్యక్రమంలో ఉద్యోగులెవరూ పాల్గొనొద్దని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్నవారిపై చట్టపరమైన చర్యలుంటాయని వివరించారు. విజయవాడలో పోలీస్‌యాక్ట్‌ 30 అమల్లో ఉంటుందని సీపీ తెలిపారు. 144 సెక్షన్‌ కూడా అమల్లో ఉంటుందని చెప్పారు.

సీపీఎస్‌ రద్దు చేయాలని, సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో రేపు చలో సీఎంవోకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సిద్ధమవుతున్న నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేస్తున్నారు. పోలీసులు అడ్డుకున్నా చలో సీఎంవో కార్యక్రమాన్ని చేపడతామని యూటీఎఫ్‌ నాయకులు చెబుతున్న విషయం తెలిసిందే.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts