Telangana News: కేంద్రం నిధులు గుజరాత్‌ రాష్ట్రానికేనా? : వినోద్‌ కుమార్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర నిధుల విడుదల విషయంలో తెలంగాణపై వివక్ష చూపుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ మండిపడ్డారు. కేవలం గుజరాత్ రాష్ట్రానికే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు.

Published : 08 Dec 2022 01:43 IST

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణపై వివక్ష చూపుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ మండిపడ్డారు. కేంద్రం నిధుల విడుదలలో కేవలం గుజరాత్ రాష్ట్రానికే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు నిధులను విరివిగా విడుదల చేయడం ఏ మేరకు సబబని ఆయన ప్రశ్నించారు.  తొమ్మిది నెలల్లో  ఒక్క గుజరాత్‌కే రూ.1,37,655 కోట్ల విలువైన ప్రాజెక్టులు, పరిశ్రమలకు  నిధులను మంజూరు చేశారని ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లో నిధుల వరద పారించారని వినోద్ కుమార్ అన్నారు. దాదాపు 40 సార్లు అక్కడ పర్యటించి నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని విమర్శించారు. ప్రధానమంత్రి హోదాలో దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యతను మోదీ విస్మరిస్తున్నారన్న ఆయన.. ఇది ప్రజాస్వామ్య మనుగడకు మంచిది కాదన్నారు. ప్రధాని మోదీ ఏకపక్ష విధానాలను ప్రజలు గమనిస్తున్నారని.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి  తగిన సమయంలో గుణపాఠం చెబుతారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని