Chandrababu: విశాఖలో చంద్రబాబు పర్యటన.. ఎండాడ వద్ద అడ్డుకున్న పోలీసులు
తెదేపా అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం విశాఖ నగరంలో పర్యటిస్తున్న ఆయన..
విశాఖపట్నం: తెదేపా అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం విశాఖ నగరంలో పర్యటిస్తున్న ఆయన.. రుషికొండ వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అనుమతి నిరాకరించారు. రుషికొండలోని హరిత రిసార్ట్స్ పరిశీలనకు బయల్దేరగా ఎండాడ జంక్షన్ వద్ద చంద్రబాబు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై తెదేపా అధినేత వాహన శ్రేణిని నిలిపేశారు.
రుషికొండ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై తెదేపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులతో పలువురు నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కొంతమంది తెదేపా నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఎండాడ నుంచి డైరీఫామ్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. అక్కడికి కాసేపటికి తర్వాత చంద్రబాబు తాళ్లవలస వెళ్లారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో
-
World News
Pakistan: బడ్జెట్ ప్రవేశపెట్టిన పాక్.. సగం అప్పులకే కేటాయింపు!