Telangana news: యాదాద్రి నిర్మాణంలోనూ కేసీఆర్‌ కుటుంబం అవినీతి: రేవంత్‌

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ఆస్తుల విలువ నిజాం వారసుల సంపదను మించిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Updated : 05 May 2022 16:46 IST

గద్దర్‌ గళం.. కాంగ్రెస్‌కు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చిందన్న పీసీసీ అధ్యక్షుడు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ఆస్తుల విలువ నిజాం వారసుల సంపదను మించిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతికి అడ్డేలేకుండా పోయిందని విమర్శించారు. గాంధీ కుటుంబంపై ప్రజా గాయకుడు గద్దర్ రూపొందించిన ‘జనం వాయిస్’ దృశ్య కావ్యాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. గద్దర్‌ గళం కాంగ్రెస్‌కు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు. యాదాద్రి నరసింహస్వామి దేవాలయ నిర్మాణంలోనూ కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. యాదాద్రి ఆలయ పనులను అవినీతి మయం చేశారని.. రూ.వందల కోట్లతో నిర్మించిన యాదాద్రిని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. వరంగల్‌లో జరిగే రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభకు రాష్ట్రంలోని రైతుల కుటుంబాల నుంచి ఒక్కొక్కరు తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్ గాంధీ చేయబోయే యుద్ధానికి రైతులు అండగా నిలవాలని రేవంత్‌రెడ్డి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని