Gujarat Election : కొనసాగుతున్న గుజరాత్‌ రెండో దశ పోలింగ్‌..

గుజరాత్‌లో రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ఈ ఉదయం ప్రారంభమైంది. 14 జిల్లాల వ్యాప్తంగా మొత్తం 93 నియోజకవర్గాల్లో ఈ దశ పోలింగ్‌ జరుగుతోంది.

Updated : 05 Dec 2022 11:44 IST

గాంధీనగర్‌ :  గుజరాత్‌ (Gujarat) లో రెండో దశ ఎన్నికల పోలింగ్‌ (Assembly elections) ఈ ఉదయం ప్రారంభమైంది. 14 జిల్లాల వ్యాప్తంగా మొత్తం 93 నియోజకవర్గాల్లో ఈ దశ పోలింగ్‌ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఉత్సాహంగా ఓటర్లు పోలింగ్‌ (Gujarat Polling) కేంద్రాలకు తరలి వస్తున్నారు. 

గుజరాత్‌లో భాజపా-కాంగ్రెస్‌-ఆప్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. దాదాపు మూడు దశాబ్దాలుగా గుజరాత్‌ను ఏలుతోన్న భాజపా మరోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాయాలని ప్రయత్నిస్తుండగా.. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్‌, సత్తా చాటాలని ఆప్‌ తీవ్రంగా శ్రమించాయి. 

మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు, యూపీలోని మెయిన్‌పురి లోక్‌ సభ నియోజకవర్గానికి ఈ ఉదయం ఉపఎన్నిక(Bypoll) పోలింగ్‌ ప్రారంభమైంది. గుజరాత్‌తో పాటు ఇటీవల ముగిసిన హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెల్లడి కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని