Vundavalli Sridevi: జగన్‌ దెబ్బకు మైండ్‌ బ్లాక్‌ అయింది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు.

Updated : 26 Mar 2023 15:55 IST

హైదరాబాద్‌: మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో వైకాపా ఆమెను సస్పెండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీదేవి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.  

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను అమ్ముడుపోయినట్లు ఆరోపణలు చేసిన వారికి త్వరలోనే రిటర్న్‌గిఫ్ట్‌ ఇస్తానని ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. వైకాపా దందాలు, అక్రమ మైనింగ్‌కు బినామీగా ఉండలేనందునే తనను పార్టీ నుంచి తప్పించారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బూచిగా చూపి తనను రోడ్డున పడేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌కు చెవులు మాత్రమే ఉంటాయని.. ఎవరు చెప్పినా వింటారన్నారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆయన కొట్టిన దెబ్బకు తన మైండ్‌ బ్లాక్‌ అయిందని శ్రీదేవి వ్యాఖ్యానించారు. సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రాణహాని ఉందన్నారు. మహిళా ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేని పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు