Sharad Pawar: ప్రత్యామ్నాయం మేమేనని నిరూపించుకోవాలి: శరద్‌ పవార్‌

భాజపాకు నిజమైన ప్రత్యామ్నాయం తామేనని ప్రతిపక్షాలు నిరూపించుకోవాల్సి ఉందని, ప్రధాని అభ్యర్థి పేరు అంత ముఖ్యం కాదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అభిప్రాయపడ్డారు.

Published : 10 Jun 2023 23:48 IST

ప్రధాని అభ్యర్థి పేరు ముఖ్యం కాదు

దిల్లీ: భాజపాకు నిజమైన ప్రత్యామ్నాయం తామేనని ప్రతిపక్షాలు నిరూపించుకోవాల్సి ఉందని, ప్రధాని అభ్యర్థి పేరు అంత ముఖ్యం కాదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అభిప్రాయపడ్డారు. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ పట్నాలో ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న సమావేశానికి హాజరవుతున్నానని చెప్పారు. శనివారం దిల్లీలో పవార్‌ మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని పేరు ప్రకటించడం అంత ముఖ్యం కాదు. 1977లోనూ ప్రధాని అభ్యర్థిగా ఎవరినీ ముందుగా ప్రకటించలేదు. జనతా పార్టీ గెలిచాక మొరార్జీ దేశాయ్‌ ప్రధాని అయ్యారు. అప్పుడు సాధ్యమైంది ఇప్పుడెందుకు కాదు’ అని పవార్‌ పేర్కొన్నారు. భాజపాపై ఉమ్మడి అభ్యర్థిని నిలిపే అంశంపై 23నాటి సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని