తమిళనాట అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొత్తగా ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ తమిళనాట అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో 234

Published : 06 Dec 2020 03:39 IST

రజనీకాంత్‌ సలహాదారు మణియన్‌


చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొత్తగా ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ తమిళనాట అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో 234 సీట్లలో పోటీ చేయనున్నట్లు రజనీకాంత్‌ సలహాదారు తమిళరువి మణియన్‌ తెలిపారు. రజనీకాంత్‌ కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టనున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న విద్వేష రాజకీయాలు కాకుండా ఆధ్యాత్మిక రాజకీయాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెలాఖరున కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానన్న రజనీకాంత్‌.. ఆ విషయమై పలువురు ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో మణియన్‌ తలైవాతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

లౌకిక, ఆధ్యాత్మిక రాజకీయాలు కలిసి పని చేయడం అసాధ్యమన్న విమర్శలను మణియన్‌ ఆయన కొట్టి పారేశారు. అలాంటి రాజకీయాన్ని రజనీకాంత్‌ సుసాధ్యం చేసి చూపుతారని అన్నారు. ఆయన ఆధ్యాత్మిక రాజకీయానికి ఏ మతంతోనూ సంబంధం లేదని చెప్పారు. ఈ తరహా రాజకీయాలను తొలుత మహాత్మగాంధీ ప్రతిపాదించారని గుర్తుచేశారు. అలాగే తాము ఏ పార్టీని విమర్శించో లేదా డీఎంకే, ఏఐఏడీఎంకే లోపాలను ఎత్తిచూపో లబ్ధి పొందాలని అనుకోవడం లేదని చెప్పారు. ప్రజలకు తాము ఏం చేయాలనుకుంటున్నామో చెప్పి ప్రజలకు చేరువ కావాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు అవినీతి రహిత, పారదర్శక పాలన అందించాలని, కుల, మతం అనే వైషమ్యాలు లేకుండా అందరికీ సంక్షేమం అందించాలని రజనీ కోరుకుంటున్నారని చెప్పారు. ఒకవేళ తాను అధికారంలోకి వచ్చినా సీఎం పదవి చేపట్టబోనన్న రజనీ ప్రకటనపై ఈ సందర్భంగా మణియన్‌ను ప్రశ్నించగా ఆ అంశం ప్రస్తావనకు రాలేదని చెప్పారు.

ఇవీ చదవండి..

వెండితెర నుంచి రాజకీయ బరిలోకి!

రజనీ పొలిటికల్‌ ఎంట్రీపై పవన్‌ స్పందన


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని