J.C. Prabhakar Reddy: మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలిపెట్టం

‘‘వైకాపా ప్రభుత్వ హయాంలో బస్సుల కొనుగోలు విషయంలో నా కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు.

Published : 20 Jun 2024 06:18 IST

వైకాపా ప్రభుత్వంలో నా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారు
తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి 

అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్‌టుడే: ‘‘వైకాపా ప్రభుత్వ హయాంలో బస్సుల కొనుగోలు విషయంలో నా కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు’ అని తెదేపా నేత, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం అనంతపురంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘తప్పుడు కేసులు పెట్టడానికి సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పటి రవాణాశాఖ మంత్రి పేర్నినాని, అధికారులు సీతారామాంజనేయులు, శివరాంప్రసాద్‌లే కారణం. వీరంతా పది రోజుల్లో నా బస్సులకు మరమ్మతులు చేయించాలి. న్యాయం జరగకపోతే నా కుమారుడు, కోడలు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేస్తారు. నేను, నా భార్య డీటీసీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తాం. ఈ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటే పార్టీకి రాజీనామా చేయడానికైనా సిద్ధం అని’ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని