KTR - Modi: మోదీ.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర?: కేటీఆర్‌

ప్రధాని మోదీ నిజామాబాద్‌ పర్యటన నేపథ్యంలో.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధించారు.

Updated : 03 Oct 2023 12:11 IST

హైదరాబాద్: ప్రధాని మోదీ మంగళవారం నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ట్విటర్ వేదికగా ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘మా మూడు ప్రధాన హామీల సంగతేంటి? కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు? బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు? పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?మూడ్రోజుల్లో రెండోసారి వస్తున్నారు.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది? పదేళ్ల నుంచి పాతరేసి ఎంతకాలం ఈ అబద్ధాల జాతర? మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు?

గూగుల్‌ విధానాలే.. ప్రత్యర్థుల ఎదుగుదలకు అడ్డు: సత్య నాదెళ్ల

గుండెల్లో గుజరాత్‌ పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా?కోచ్‌ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఊపిరి తీశారు. లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్‌ను ఆగం చేశారు. పసుపు బోర్డు ప్రకటన కూడా మహిళా రిజర్వేషన్‌లాగే ఉంది. తెలంగాణలో మళ్లీ వంద చోట్ల మీ డిపాజిట్ల గల్లంతు గ్యారెంటీ’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు