Congress: కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర: సోనియా గాంధీ ప్రకటన

దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ‘భారత్‌ జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్లు........

Published : 15 May 2022 18:01 IST

ఉదయ్‌పూర్‌: కేంద్రంలోని భాజపా సారథ్యంలోని ఎన్డీయే సర్కారు లోపాలను ఓవైపు లేవనెత్తుతూనే.. తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేలా కాంగ్రెస్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ‘భారత్‌ జోడో యాత్ర’ పేరుతో కాంగ్రెస్‌ పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘నవసంకల్ప చింతన శిబిరం’లో ముగింపు కార్యక్రమంలో సోనియా మాట్లాడారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని వచ్చే అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ఈ పాదయాత్ర కొనసాగుందని వెల్లడించారు. కాంగ్రెస్‌లోని సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరూ ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా పలు ఛలోక్తులు విసిరారు సోనియా గాంధీ. సభకు సీనియర్‌ నేతలంతా హాజరుకావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. సొంత కుటుంబంతో ఓ సాయంత్రం గడిపినట్లు ఉందని పేర్కొన్నారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ తిరిగి బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘మళ్లీ పుంజుకుంటాం’ అని బలంగా చెప్పిన సోనియా.. ఇదే మా ‘సంకల్పం’ అని అన్నారు. కాంగ్రెస్‌ బలోపేతానికి ఈ సభ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్న ఆమె.. పార్టీ పుంజుకునేందుకు అందిన సిఫార్సులపై త్వరితగతిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని