Priyanka Gandhi: భాజపాపై ప్రియాంక ఘాటు విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Elections 2023) ప్రచారంలో బిజీగా ఉన్నారు. దానిలో భాగంగా ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. 

Published : 03 May 2023 23:10 IST

బెంగళూరు: సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అయిన ప్రధాని మోదీ(Modi)కి కర్ణాటక ప్రభుత్వంలో జరుగుతోన్న అవినీతి ఎందుకు కనిపించడం లేదని కాంగ్రెస్ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) ప్రశ్నించారు. ఆ రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం (Karnataka Elections 2023)లో భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఈ ప్రపంచమంతా మోదీని సర్వాంతర్యామి, సర్వజ్ఞులు, వికాస పురుషుడు అని పిలుస్తోందని ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకను అభివృద్ధి చేసి, దేశానికి ఆదర్శంగా నిలపాలని ఆయన భావిస్తున్నారన్నారు. ‘మరి మీ కలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు..? రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వం 40 పర్సెంట్‌ కమిషన్ సర్కార్‌గా మారి, ప్రజలను దోచుకుంటుంటే..  మీరు ఏం చేస్తున్నారు..? అవినీతికి పాల్పడే వారిని ఎందుకు ఆపడం లేదు. ఆయన కలలు కనడంలో బిజీగా ఉండి కళ్లు మూసుకోవడంతో ఈ దోపిడీ కనిపించడం లేదు. దానిని అనుమతించారు. అసలు ఎందుకు మీ ప్రభుత్వాన్ని 40 పర్సెంట్‌ కమిషన్ సర్కార్‌ అంటారు..? ఈ సర్కారే తమ చావుకు కారణమంటూ కాంట్రాక్టర్లు ప్రాణాలు తీసుకుంటున్నారు. కానీ  ఇప్పటివరకు మోదీ నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు. రైతుల ఆత్మహత్యలపై ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నారు..?’అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

కొద్దిరోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తూ, వైరిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అక్కడ మే 10న ఎన్నికల జరగనుండగా.. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని