Ashok Gehlot: అశోక్‌ గహ్లోత్‌ సీఎంగా ఉంటారా? సోనియా ఏం నిర్ణయం తీసుకుంటారో..!

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదని అశోక్‌ గహ్లోత్‌ స్పష్టంచేయడంతో ఇటీవలి రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆయన సీఎంగా.....

Published : 29 Sep 2022 19:25 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదని అశోక్‌ గహ్లోత్‌ స్పష్టంచేయడంతో ఇటీవలి రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆయన సీఎంగా కొనసాగుతారా? లేదా అనే చర్చ మొదలైంది. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ను విలేకర్లు ప్రశ్నించగా.. ఈ విషయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు. మరోవైపు, రాజస్థాన్‌ సంక్షోభం తర్వాత ఈరోజు తొలిసారి సోనియా గాంధీతో గహ్లోత్‌ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఆమెతో చర్చించి ఆదివారం జరిగిన పరిణామాల్ని ఆమెకు వివరించారు. అనంతరం గహ్లోత్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు స్పష్టంచేశారు. సోనియాను కలిసిన సందర్భంగా ఆమెకు క్షమాపణలు చెప్పానన్నారు.

ఇటీవల తాను రాహుల్‌ గాంధీని కోచిలో కలిసి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని కోరానన్నారు. అందుకు రాహుల్‌ అంగీకరించకపోవడంతో తాను పోటీ చేయాలనుకున్నట్టు తెలిపారు. కానీ.. రాజస్థాన్‌ రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానన్నారు. ఆదివారం జరిగిన ఘటనలపై సీఎల్పీ నేతగా, సీఎంగా తన నైతిక బాధ్యతగా సోనియాకు క్షమాపణ చెప్పానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనా, ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకొనేందుకు గహ్లోత్‌ సిద్ధపడకపోవడంతో రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఒకవేళ గహ్లోత్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజస్థాన్‌ తదుపరి సీఎంగా సచిన్‌ పైలట్‌ను చేయొద్దంటూ గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడం వంటి పరిణామాలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts